అంబాజీపేట మండలం వాకలగరువు పుష్కరఘాట్ వద్ద మంగళవారం ఒక గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. సుమారు 30-40 ఏళ్ల వయసున్న ఈ యువకుడు నలుపు ప్యాంట్, తెలుపు బనియన్ ధరించి ఉన్నాడు. అతని కుడి మణికట్టుపై ఎరుపు దారంతో కట్టిన లక్ష్మీదేవి ప్రతిమ ఉంది. ఈ యువకుడి వివరాలు తెలిసినవారు అంబాజీపేట పోలీసులను సంప్రదించాలని ఎస్సై చిరంజీవి కోరారు.