బెల్లంపూడి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

పి. గన్నవరం మండలం బెల్లంపూడిలో సి.ఎస్.ఆర్ నిధులతో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించబడే పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చినప్పుడు స్కూల్ పరిస్థితులు చూసి పిల్లలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ఆయన అన్నారు. పాఠశాల నిర్మాణానికి సి.ఎస్.ఆర్ ద్వారా 30 లక్షల నిధులు కేటాయించామని, అవసరమైతే తన సొంత నిధులతో మరో 10 లక్షలు వెచ్చించి నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్