నెల రోజుల క్రితం గల్ఫ్ నుంచి స్వగ్రామం ఎం. కడలికి వచ్చిన నెల్లి హర్షవర్ధన్ (23) శనివారం రాత్రి పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద స్పోర్ట్స్ బైక్తో కరెంటు స్తంభాన్ని ఢీకొని విషాదకరంగా మృతి చెందాడు. గతంలో కాలు ఫ్రాక్చర్ కావడంతో వేసిన రాడ్డును తొలగించుకోవడానికి వచ్చిన యువకుడు ఇలా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.