పి. గన్నవరం మండలం ముంగండ జిల్లా పరిషత్ ప్రధాన పాఠశాల స్టాఫ్ రూమ్ లో సోమవారం సుమారు 5 అడుగుల జెర్రిపోతు పాము కనిపించడంతో ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా, ఆయన అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతానని తెలిపారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా తనకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.