తూ. గో జిల్లా గోపాలపురం గ్రామంలో 100 ఏళ్ల నాటి విగ్నేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించే క్రమంలో, గ్రామస్తులు ఆలయాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో, ఆలయం కింద ఉన్న మట్టిని రెండు నెలల క్రితం ఊరి చివరన ఉన్న కర్రల మిషన్ లో వేశారు. భారీ వర్షానికి మట్టి కరిగి విగ్రహం తల కనిపించడంతో, అక్కడ ఉన్న సత్యనారాయణ అనుమానంతో తవ్వి చూడగా, విగ్రహం బయటపడింది. గ్రామస్తులు విగ్రహాన్ని బయటకు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి ఆస్థాన పండితులు వెంకటేశ్వర శాస్త్రి విగ్రహాన్ని పరీక్షించి, ఇది 900 సంవత్సరాల నాటి రుక్మిణీ సమేత గోపాల స్వామి విగ్రహమని, అత్యంత మహిమాన్వితమైనదని తెలిపారు. ఈ విగ్రహం దొరకడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.