దేవరపల్లిలో మంగళవారం తూ. గో జిల్లా స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. క్రీడలలో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి రామారావుతో పాటు పలువురు పాల్గొన్నారు.