దొమ్మేరు గ్రామ శివారులో నేషనల్ హైవే పక్కన ఉన్న చాగల్లు-నందమూరు మార్గంలో సోమవారం రోడ్డు అధ్వానంగా మారింది. నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై గుంతలు పడి, నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు, రైతులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరి కోతల అనంతరం ధాన్యం బస్తాలతో వెళ్లే ట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నాయి. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.