దేవరపల్లి మండలం ధూమంతునిగూడెంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఏర్పాటుకు గతంలో శంకుస్థాపన చేసినట్లు అభిమానులు తెలిపారు. టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, విగ్రహం ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగిస్తామని అభిమానులు పేర్కొన్నారు.