తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో పెద్ద కాలువకు ఆకస్మిక వరద వచ్చింది. ఫలితంగా పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో కాలనీ వాసులు బయటకు రాలేకపోతున్నారు. బురద కాలువ పొంగి కోరుకొండ మండలంలోనూ ముంపు పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి, ముంపు నీరు బయటకు వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.