కాశీబుగ్గలో జరిగిన సంఘటన నేపథ్యంలో, కాకినాడ జిల్లాలోని అన్నవరం, పిఠాపురం, సామర్లకోట వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఫోన్లో మాట్లాడుతూ, కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆలయాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.