కరప మండలంలోని పెనుగుదురు గ్రామానికి చెందిన ప్రమీల (28) అదృశ్యమైనట్లు ఆమె భర్త డేగల నానిబాబు ఆదివారం కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 31వ తేదీన 'నన్ను క్షమించండి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి' అని లేఖ రాసిపెట్టి ప్రమీల వెళ్లిపోయినట్లు నానిబాబు తెలిపారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎస్ఐ సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.