వానపల్లిలో ప్రమాదకరంగా వంతెన

కొత్తపేట మండలం వానపల్లిలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న పంట కాలువ వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయాలలో ప్రయాణాలు చేసేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆదివారం తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్