నర్సిపూడి: కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న చిర్ల

ఆలమూరు మండలం నర్సిపూడిలో బుధవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్