కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. శుక్రవారం రావులపాలెం పట్టణ కేంద్రంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.