భవాని భక్తుల కారు ప్రమాదం: ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దిగ్భ్రాంతి

నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద నడిచి వెళ్తున్న భవాని భక్తులు కారు ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ, దసరా సమయంలో వందలాది భక్తులు నియోజకవర్గం మీదుగా విజయవాడకు వెళ్తుంటారని తెలిపారు. భక్తులు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా యాత్ర సాగేలా తగు అవగాహన కల్పించాలని అధికారులకు, నాయకులకు సూచించామని పేర్కొన్నారు. భవాని భక్తులు పగలు, రాత్రిళ్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్