గోకవరంలో బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

గోకవరంలో మంగళవారం రాత్రి రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తంటికొండ గ్రామానికి చెందిన పాల వ్యాపారి పూడి రాజు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్