కొవ్వూరు రైల్వేస్టేషన్ వద్ద యోగాతో నిరసన

కొవ్వూరు నియోజకవర్గంలో 2019 నాటి రైలు హాల్ట్‌లను పునరుద్ధరించడంలో రైల్వే శాఖ విఫలమైందని ఆరోపిస్తూ, ఆదివారం కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద 'మన కొవ్వూరు - మన బాధ్యత' పేరుతో నిరసన తెలిపారు. ప్రణవ సంకల్ప యోగా సమితి, రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు యోగాసనాల ద్వారా తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుడ్డుపూడి గణేష్, పొట్నూరి చెల్లేశ్వర రావ్, హజీబు జగన్నాధ రావ్, గారపాటి రామ్మోహన్ రావ్, విల్సన్ రాజు పాల్గొన్నారు. రైల్వే శాఖ సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని నిరసనకారులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్