మండపేట: మంచినీటి సరఫరాలో అంతరాయం

మండపేట పట్టణ పరిధిలోని బస్టాండ్ వద్ద వాటర్ సప్లై పంపింగ్ మెయిన్ లైన్ లీకైందని మునిసిపల్ డిఇ కింతాడ శ్రీనివాస్ తెలిపారు. ఈ కారణంగా, ఈ నెల 5వ తేదీ బుధవారం మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన మంగళవారం వెల్లడించారు. అయితే, ఈ నెల 6వ తేదీ గురువారం నుండి యధావిధిగా నీటి సరఫరా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్