ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో 11 కె. వి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆదివారం ఉదయం తెలిపారు. వెదురు బొంగులు విద్యుత్ తీగలకు తగులుతూ ఉండడంతో, వాటిని తాకిన వారికి విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.