ముమ్మిడివరం మండలం చింతపల్లిలంక గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక, ఈ నెల 1వ తేదీన వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక మానసిక స్థితి సరిగా లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జ్వాలాసాగర్ సోమవారం తెలిపారు.