కాట్రేనికోన మండలం కాట్రేనికోనకు చెందిన 8 ఏళ్ల విద్యార్థి విత్తనాల కుశాల్ నాగ వెంకట్, 195 దేశాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను కేవలం 2 నిమిషాల 59 సెకన్ల 11 మిల్లి సెకన్ల కాలవ్యవధిలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, స్కూల్ ఉపాధ్యాయుల సమక్షంలో అవార్డును బహుకరించారు.