తాళ్లరేవు: నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు, ముఖ్యంగా మత్స్యకారులకు సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో బాధితులకు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటు, కేజీ ఉల్లిపాయలు, లీటర్ నూనె, కేజీ పప్పు, కేజీ బంగాళదుంపలు, కేజీ చక్కెర వంటివి ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

సంబంధిత పోస్ట్