యానాం: యువతి గల్లంతు

తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన సీరపు కల్యాణి(25) యానాం ముఖద్వారం వద్ద కోరింగ నదిపై ఉన్న పొట్టి శ్రీరాములు వారధి పైనుంచి దూకి మంగళవారం గల్లంతైనట్లు యానాం పోలీసులు తెలిపారు. తూర్పుపేట నుంచి స్థానిక పాతబస్టాండ్ కు ఆటోలో వచ్చిన ఆమె వంతెనపైకి నడుచుకుంటూ వెళ్లి చెప్పులు, పర్సు, ఫోన్ వదిలేసి నదిలోకి దూకేసినట్లు చెప్పారు. ఆమె కోసం నది వద్ద గాలింపు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్