పెరవలి మండలం ముక్కామల గ్రామాల్లో తుపాన్ కారణంగా నష్టపోయిన అరటి తోటలను నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గురువారం సాయంత్రం పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి, నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, పంట నష్టాన్ని సత్వరం అంచనా వేసి రైతులకు సహాయం అందించాలని వారు కోరారు.