ఏపీని గ్లోబల్ టూరిజం మ్యాప్ పై సగర్వంగా నిలబెడతాం: మంత్రి

లండన్ లోని ఎక్సెల్ లండన్ లో నవంబర్ 4 నుండి 6 వరకు జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ఎగ్జిబిషన్ లో నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ లు మంగళవారం పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికపై ఏపీ పర్యాటక ఖ్యాతిని వివరించామని, ఏపీని గ్లోబల్ టూరిజం మ్యాప్ పై సగర్వంగా నిలబెడతామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీ పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్