తమ డిమాండ్ల సాధన కోసం యూ.కొత్తపల్లి మండలం మత్స్యకారులు మంగళవారం తెల్లవారుజామునే రోడ్డెక్కారు. ఉదయం 4 గంటలకు ఉప్పాడ రింగ్ రోడ్డు వద్ద ఆందోళనకు దిగిన మత్స్యకారులు, కాకినాడ నుంచి బీచ్ రోడ్డుకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎటువంటి గొడవలకు తావులేకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.