యూ. కొత్తపల్లి: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

యూ. కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం నూకరాజు (31) అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. రొయ్యల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న నూకరాజు, జనరేటర్ కు మరమ్మతులు చేస్తుండగా కరెంటు రివర్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్