తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం తిరుమాలిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. మనస్పర్థల కారణంగా విడిపోయిన భార్యతో సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ, పెంటపాటి హరిబాబు అనే యువకుడు తన అత్త (సూరిబాబు, అప్పలరాజు దంపతుల కుమార్తె తల్లి) అప్పలరాజు, వదిన దుర్గా సాయిలపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అప్పలరాజు తీవ్రంగా గాయపడగా, దుర్గా సాయి స్వల్పంగా గాయపడ్డారు. బాధితులకు ఏలేశ్వరం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.