మొంథా తుఫాన్ ప్రభావంతో గండి పడిన ప్రదేశాలను పరిశీలించిన జేఈ

మొంథా తుఫాన్ ప్రభావంతో గోకవరం మండలంలోని తంటికొండ–గాదెలపాలెం గ్రామాల మధ్య ఉన్న ఇసుకపల్లి వారి చెరువుకు గండి ఏర్పడింది. ఆదివారం ఇరిగేషన్ శాఖ జేఈ ఘటనాస్థలాన్ని సందర్శించి పరిశీలించారు. తూర్పు వైపు నుంచి వచ్చిన మురుగునీరు, బురదపోటు కారణంగా చెరువు గట్టు దెబ్బతిన్నట్లు తెలిపారు. త్వరితగతిన మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్