నవంబర్ 2న కాకినాడ జిల్లాలోని అన్నవరంలో జరగనున్న సత్యనారాయణ, అనంతలక్ష్మి అమ్మవార్ల హంస వాహన తెప్పోత్సవ కార్యక్రమానికి అధికారులు గురువారం పంపా జలాశయంలో ట్రయల్ రన్ నిర్వహించారు. పంపా నది తీరంలో పరిస్థితిని, వాహన నిర్వహణను అంచనా వేయడానికి ఈ ట్రయల్ రన్ జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.