తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కొంత ఊరట కలిగించింది. అయితే, పాఠశాలలు, కళాశాలలు విడిచిపెట్టే సమయం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ఆఫీసుల నుండి వచ్చే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్షం కారణంగా రాజమండ్రిలో జనజీవనం కొంతవరకు స్తంభించింది.