ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 14వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా వ్యాపారం ఉద్యోగుల సమస్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మి రాజకీయ జీవితం కార్మికులతోనే సుదీర్ఘకాలం సాగిందన్నారు.