రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద గోదావరిలో స్నానానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఇద్దరు భవానీ మాలధారులు నదిలో గల్లంతయ్యారు. గోకవరం మండలంలోని పెంటపల్లికి చెందిన గొబ్బుల బాపిరాజు (28) హైదరాబాద్ లో ఉంటున్న రాజానగరం మండంలోని శ్రీరాంపురానికి చెందిన రాయుడు వీరబాబు (25) భవానీ మాలధారణ కోసం ఇటీవల నగరానికి వచ్చి వరుసకు బావ అయిన బాపిరాజుతో కలిసి దీక్ష స్వీకరించారు. శనివారం సాయంత్రం స్నానాలు చేస్తుండగా లోతు అంచనా వేయలేక గల్లంతయ్యారు.