ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు వాయిదా

డ్రైవర్ హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై రాజమండ్రి స్పెషల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. శుక్రవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తుది తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం అనంతబాబు బెయిల్‌పై ఉండగా, కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు కీలకం కానుంది.

సంబంధిత పోస్ట్