కడియం మండలం కడియపులంక శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక సోమవారం పురస్కరించుకొని కోటి దీపోత్సవ కార్యక్రమం గత రాత్రి ఎంతో వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో కడియపులంక ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులతో వెదజల్లింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఆలయ కమిటీ వారు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.