రాజమహేంద్రవరం నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సత్యదేవకుమార్ (16) అనే విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన సత్యదేవకుమార్, కళాశాల వసతిగృహంలో ఉండలేక ఇంటికి వెళ్తానని తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. అనారోగ్యంతో ఉన్న అతన్ని తండ్రి ప్రసాద్ గత నెల 28న ఇంటికి తీసుకెళ్లి, మంగళవారం ఉదయం తిరిగి వసతిగృహంలో దింపి వెళ్లారు. మధ్యాహ్నం సత్యదేవకుమార్ వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం రావడంతో తండ్రి ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు.