సోమవారం తెల్లవారుజాము నుండి భక్తులు రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. సప్త గోదావరిలో స్నానం ఆచరించి, అరటి డొప్పలపై దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు క్యూలైన్ ద్వారా దర్శన ఏర్పాట్లు చేసి, మంచి నీటి సౌకర్యం, తీర్థప్రసాదాలు అందించారు.