శనివారం కె. గంగవరం మండలం కోటిపల్లి రేవులో ఉన్న కాకా హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల అప్రమత్తతతో హోటల్లో ఉన్న మహిళను బయటకు తీసుకురావడంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.