రాజోలు మండలం పొన్నమండలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అప్పటివరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురవడంతో, పొన్నమండ రహదారిపై గోతులు కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు రహదారిపై నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.