శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందడంపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం సఖినేటిపల్లిలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పోలీసు బందోబస్తు లేకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని ఆరోపించారు. ఈ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.