కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచులు, ఆదివాసీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని ఎంపీడీవో రాజకుమార్ మంగళవారం సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో జరిగిన సమావేశంలో తెలిపారు. వారికి అవసరమైన తాగునీరు, విద్య, ఆరోగ్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస నగేష్ కూడా పాల్గొన్నారు.