ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ వర్తింపు

AP: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2020 జనవరి 1వ తేదీ తర్వాత రిటైరైన ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింపజేయనుంది. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. విశ్రాంత ఉద్యోగి జీవిత భాగస్వామికి సైతం ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సూపరింటెండెంట్ కేటగిరీ వరకు రూ.38,572 ప్రీమియం చెల్లించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్