AP: తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు విద్యుత్ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది. విద్యుత్ సంస్థల యాజమాన్యంతో విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమని స్పష్టం చేసింది. 29 ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నెల 30న ఐకాస సమ్మె నోటీసు ఇచ్చింది. దాంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు బుధవారం వివిధ డిమాండ్లపై ఐకాస ప్రతినిధులు చర్చించారు.