విద్యుత్ చార్జీల కోత.. రూ.923.55 కోట్లు వెనక్కివ్వాలని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) చంద్రబాబు ప్రభుత్వానికి విద్యుత్ చార్జీల విషయంలో మొట్టికాయలు వేసింది. అదనంగా వసూలు చేసిన రూ.923.55 కోట్లను విద్యుత్ వినియోగదారులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. 2024-25 సంవత్సరానికి ట్రూ అప్ చార్జీలుగా డిస్కంలు ప్రతిపాదించిన రూ.2,758.76 కోట్లలో రూ.895.12 కోట్లు తగ్గించి, రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ మొత్తంలో ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేసిన బిల్లులను వాయిదాల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్