ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామపంచాయతీలో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. తల్లికి వందనం, దీపం పథకం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు మొదలగు పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.