ఏలూరు జిల్లా ఏ. ఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఏఆర్ ఆర్‌ఐ పవన్ కుమార్ ల ఆధ్వర్యంలో, కైకలూరు టౌన్ ఎస్ ఐ వెంకట్ కుమార్ తో కలిసి డాగ్ స్క్వాడ్ సిబ్బంది శనివారం కైకలూరు టౌన్ పరిధిలో విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు కైకలూరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, శ్యామలంబ అమ్మ వారి ఆలయం, పరిసర దేవాలయాలు, లాడ్జిలు, సినిమా థియేటర్ ప్రాంతాలలో నిర్వహించారు.