కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 32 ఏళ్ల విజయ, పాము కాటుకు గురై శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. గురువారం రాత్రి తన ఇంటి వద్ద దుకాణంలో ఉండగా పాము కాటేసింది. బంధువులు ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్సలో ఆమె మరణించింది. ఈ ఘటనపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.