విద్యార్థికి కొవ్వలి ఫౌండేషన్ ఆర్థిక సాయం

నర్సాపురం రాయపేటకు చెందిన కేసరి యోక్షిత్ బాబి గుంటూరు ఆర్ వి ఆర్ అండ్ జెసి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కరోనా సమయంలో తన తండ్రి మరణించడంతో తల్లి టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను కొవ్వలి ఫౌండేషన్ ఆశ్రయించారు. విద్యకు సహకరించాలని కోరగా శుక్రవారం కొవ్వలి ఫౌండేషన్ రెండో వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థికి హాస్టల్ ఫీజు నిమిత్తం 20000 ఆర్థిక సహాయాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్