నూజివీడు నియోజకవర్గ సీపీఐ కార్యవర్గ సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, ఆనందం శనివారం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. చాట్రాయి ఆసుపత్రిలో పాముకాటుకు నిరంతరం వైద్య సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల చిన్నంపేటలో కూలి పనులకు వెళ్ళిన మహిళ పాముకాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా సరైన చికిత్స అందక మరణించిందని వారు పేర్కొన్నారు.