పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు బుధవారం టి. నరసాపురం మండలం బొర్రంపాలెంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చింతలపూడి - రావికంపాడు రోడ్డు రూ. 4. 22 కోట్లతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఎమ్మెల్యే బాలరాజు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.